దేవాలయం ప్రత్యేకత

శ్రీ శ్రీ శ్రీ భూలక్ష్మి దేవస్థానం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర ఆలయం, ఇది హైదరాబాద్ మాదన్నపేటలోని సాయిలాల్ తోట లో ఉన్నది. చారిత్రక ఆధారాల ప్రకారం, గోల్కొండ సామ్రాజ్యంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మరియు మాదన్న గారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించేవారని విశ్వాసం ఉంది. బహుళ సంవత్సరాల పాటు ప్రజల భక్తికి ప్రాతినిధ్యం వహించిన ఈ ఆలయం, 2018లో బస్తీ వాసుల సంకల్పంతో పునర్నిర్మించబడింది. అప్పటి నుంచి ఆలయం ఆధ్యాత్మికతకు మారుపేరు అయింది. ప్రతి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుతారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా చండి హోమం నిర్వహించబడుతుంది, ఆ అనంతరం అన్నప్రసాదం అందరికి పంపిణీ చేయబడుతుంది. ఈ ఆలయం కేవలం పూజలకే కాకుండా, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రజల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది.

గ్యాలరీ

Avatar
Avatar
Avatar

రాబోయే పండుగలు

శ్రీ శ్రీ శ్రీ భూలక్ష్మమ్మ 7వ వార్షికోత్సవం

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సం॥ర జ్యేష్ట మాస శుద్ధ॥ చతుర్ధి తేది:30-05-2025 శుక్రవారము 7 వ వార్షికోత్సవమును పునస్కరించుకుని చండీహోమము వైభవంగా నిర్వహించబడును.

చండీహోమము ఉ॥ 07.00 గం॥లకు

అన్నప్రసాద వితరణ కార్యక్రమము: మ॥ 01.00 గం॥లకు

బోనాలు

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సం॥ర ఆషాఢ మాసం తేది: 20-07-2025 ఆదివారం